Wednesday, 27 February 2013


దేశసౌభాగ్య విధాతల చిరునామా 

` పి.వరలక్ష్మి, ఎస్‌.ఏ. తెలుగు, 
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, గొల్లనపల్లి
కదిలే గ్రంథాలయాలన్నట్లు
గుర్తు చెప్పే గురువులున్నదీ.. పాఠశాల
ముసిముసినవ్వుల బుడిబుడినడకల 
బుడతలు, భావి పౌరులున్నదీ.. పాఠశాల
జ్ఞానజ్యోతులై వెలుగొందుచు
తను ఉన్న ఊరికీ, తనను గన్నవారికీ 
కీర్తి కిరీటాలు పెట్టించుకఁన్నదీ.. పాఠశాల
వివిధ కళల, క్రీడల ఆటపట్టు
వివిధ కవుల, కృషీవలుల, శాస్త్రవేత్తల
దేశసౌభాగ్య విధాతల చిరునామా పాఠశాల
గతజన్మ గవాక్షములు తెరిచి చూపించి
నేటిజన్మ సాఫల్యములందించు గురువులున్నదీ.. పాఠశాల
ఆటపాటలతో అలవోక విద్యనందించు 
ఉపాధ్యాయ సంపద ఉన్నదీ.. పాఠశాల
అందరిలో ఆత్మవిశ్వాసమును పెంపొందించి 
అందరి జీవిత సంద్రాలను దాటించు నౌక.. పాఠశాల
ఇచట పుట్టిన చిగురు కొమ్మలను 
చేవదేరునట్లుచేయు బృహస్పతులున్నదీ.. పాఠశాల

No comments: