Friday 15 August 2014





ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం 

15-08-2014న గొల్లనపల్లి హైస్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది. హెచ్ ఎం మీనాక్షిదేవి అధ్యక్షతన  జరిగిన ఈ కార్యక్రమములో సర్పంచ్ మెండే జయకాంతమ్మ మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. బడి పిల్లలు మార్చ్ ఫాస్ట్ చెశారు. సర్పంచ్ మెండే జయకాంతమ్మ, ఎంపీటీసీ బర్రే పాప, యస్ ఎం సి ప్రెసిడెంట్ పి. సుధాకర్ తదితరులు సందేశాలు ఇచ్చారు. పూర్వ విధ్యార్ధి సీహెచ్  పూర్ణచంద్రరావు  (అమెరికా) ఈ ఏడాదీ పదవ తరగతిలో మొదటి.. రెండవ.. మూడవ స్థానాలు వచ్చిన పిల్లలకు నగదు చెక్కులు అందచేశారు. గన్నవరము బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శీలం వెంకట సాం బంశివరావు తన తండ్రి మాధవరావును స్మరించుకుంటూ అయిదు వేల రూపాయల విలువ చెసే 100 మధ్యానపు భొజన పళ్ళాలను బహూకరించారు. హెచ్ ఎం మీనాక్షిదేవి దాతలను అభినందించారు. కార్యక్రమములో ఉపాధ్యాయులు రాంబాబు మాస్టారు.. రవి.. నాగభూషనం.. డాక్టర్ భాగవతుల హేమలత.. తదితర ఉపాధ్యాయులు.. గ్రామస్తులు పాల్గొనారు.  


Friday 8 August 2014

ప్రియమయిన పూర్వ విద్యార్ధులు.. ప్రస్థుత విధ్యార్ధులకు...

మన పూర్ణకు శుభాభినందనలు




ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మన  పూర్వ విద్యార్ధి అందరూ ఆప్యాయంగా పిలుచుకునే పూర్ణ (చిట్నేని పూర్నచంద్రరావు) 2013-14 పదవ తరగతిలో ప్రథమ.. ద్వితీయ.. త్రుతీయ స్థానాలను సంపాదించిన వారికి   15-08-2014 శుక్రవారం గొల్లనపల్లి లోని మన ఉన్నత పాఠశాలలో బహూకరించనున్నారు. పూర్ణ కొంతకాలంగా ఈ బహుమతులను అందచేస్థున్నారు. 
 ఈ బడిలో అనేక మంది చదివారు. చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. విదేశాల్లోనూ ఉన్నారు. కొద్ది మందే మన బడి గురించి ఆలోచిస్థున్నారు. వారిలో మన పూర్ణ ఒకరు. పూర్ణ వూరు చిక్కవరం. పదవతరగతి వరకూ ఇక్కడే చదివారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నత స్థానంలో ఉన్నారు. అయినా మన బడినీ.. మన పిల్లలను గుర్తు పెట్టుకొని ప్రతి ఏదాదీ  బహుమతులు ఇవ్వడం  అభినందనీయం. సొంతలాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడుపడవోయి అని మన గురజాడ అప్పారావు గారు అన్నారు. దీనిని కొనసాగ్స్తున్న పూర్ణకు శుభాభినందనలు. 

Sunday 3 August 2014

Mana High School Hindi Pandit 
Dr,Bhagavatula Hemalatha Gaariki
 Satkaaram